
కృపా కృపా సజీవులతో నను
కృపా కృపా సజీవులతో నను నిలిపినదే నీ కృపా నా శ్రమ దినమున నాతో నిలిచి నను ఓదార్చిన నవ్యకృపా నీదు కృపా కృపా సాగర మహోన్నతమైన నీ కృపా చాలునయా 1 . శాశ్వతమైన నీ ప్రేమతో నను ప్రేమించిన శ్రీకరుడా నమ్మకమైన నీ సాక్షినై నే నీ దివ్య సన్నిధిలో నన్నోదిగిపోనీ నీ ఉపదేశమే నాలో ఫలభరితమై ఈ కమనీయ కాంతులను విరజిమ్మీనే నీ మహిమను ప్రకటింప నను నిలిపేనే 2. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలె గమ్యమును చూపే నిను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాధరించితివి నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినముల ఆధ్యంతము ఒక క్షణమైనా విడువని ప్రేమామృతము 3 . అత్యున్నతమైన కృపాలతో ఆత్మ ఫలముల సంపదతో అతి శ్రేష్ఠమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ నా హృదయార్పణ నిను మురిపించని, నీ గుణాతిశయములను కీర్తించని ఈ నిరీక్షణ నాలో నె రవేరనీ


Follow Us