
పాడెద స్తుతిగానము
పాడెద స్తుతిగానము కొనియాడెదా నీ నామము నీవే నా ప్రేమానురాగం -క్షణమైనా విడువని స్నేహం అతిశ్రేష్టుడా నా యేసయ్యా 1.ఇల నాకెవ్వరు లేరనుకొనగా నా దరి చేరితివే నే నమ్మిన వారే నను మరచినను మరువని దేవుడవు నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ అనుబంధము నాకు ఆనందమే 2.నా ప్రతి అణువును పరిశుద్ధపరిచెను నీ రుధిరధారలే నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకు నీ చేతులే నను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను నీ అభిషేకము పరమానందమే 3.బలహీనతలో నను బలపరిచి ధైర్యము నింపితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి యూదా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే నీ పరిచర్యలో మహిమా నందమే


Follow Us