
సిలువలో నాకై చేసిన యాగము
సిలువలో నాకై చేసిన యాగము మరువలేనయ్యా మరచిపోనయ్యా నీ ప్రేమను… నీ త్యాగము… మరువలేనయ్యా నీ ప్రేమను మరచిపోనయ్యా నీ త్యాగము (2) సిలువలో నాకై చేసిన యాగము (2) ||మరువలేనయ్యా|| నా కోసమే నీవు జన్మించితివి నా కోసమే నీవు సిలువనెక్కితివి (2) నా కోసమే నీవు మరణించితివి (2) నా కోసమే నీవు తిరిగి లేచితివి (2) ||మరువలేనయ్యా|| ఎవరూ చూపని ప్రేమను చూపి ఎవరూ చేయని త్యాగము చేసి (2) విడువను ఎడబాయను అన్నావు (2) నీ నిత్యజీవమును నాకివ్వగోరి (2) ||మరువలేనయ్యా||


Follow Us