
కరుణా సంపన్నుడా
కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా (2) నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వీకుడా నీకోసమే నా జీవితం ||కరుణా|| 1. ఏ నాడు నను వీడని - నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే - సందడిని చేసెను (2) అణువణువును బలపరిచే - నీ జీవపువాక్యమే ప్రతిక్షణము దరిచేరి - నన్నే తాకెను (2) ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్నే నడిపించెను ||కరుణా|| 2. ఈ వింత లోకంలో - నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమలోనే - ఆదరణ పొందితిని (2) నీ కృపలో నిలిపినది - నీ ప్రేమ సంబందమే అనుదినము మకరందమే - నీ స్నేహబంధము (2) ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా - స్థిరపరచుమా ||కరుణా|| 3. నే వేచియున్నాను - నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణనే - సన్నిధిలో నిలిపినది (2) నా కోసం నిర్మించే - సౌందర్యనగరములో ప్రణమిల్లి చేసెదను - నీ పాదాభివందనం (2) తేజోమయా నీ శోభితం - నే పొందెద కొనియాడెద ||కరుణా


Follow Us