
యేసయ్య నీ ప్రేమ నా సొంతము
యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి నీవే నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా పర్వత శిఖరం నీ మహిమ ద్వారం ఉన్నతమైనది నీ దివ్య చరితం సాటే లేరు నీకు - సర్వాధికారివి నీవు మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు


Follow Us